ap cabinet meating
- అమరావతిలో లోక్‌భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణం
- గవర్నర్ కార్యాలయం, రెండు గెస్ట్ హౌస్‌లు, స్టాఫ్ క్వార్టర్లకు అనుమతి
- క్వాంటం కంప్యూటింగ్‌లో రూ.1421 కోట్ల పెట్టుబడులు
- కేబినేట్ వివరాలు వెల్లడిరచిన మంత్రి పార్థసారథి

అమరావతి,డిసెంబర్11
రాష్ట్రంలో రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.దాదాపు 44 అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో సమగ్ర నీటి నిర్వహణకు సంబంధించిన ప్రాజెక్టులు, అమరావతిలో లోక్‌భవన్, అసెంబ్లీ దర్బార్ హాల్ నిర్మాణానికి,గెస్ట్ హౌస్‌లు, స్టాఫ్ క్వార్టర్ల నిర్మాణానికి మంత్రివర్గ సమావేశంలో చర్చించి అంగీకారం తెలిపారు. అలాగే పలు సంస్థలకు భూ కేటాయింపులకు కేబినెట్ అనుమతి ఇచ్చింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో 44 అజెండా అంశాలకు ఆమోదం తెలిపారు. సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి విూడియాకు వివరించారు. 44 అంశాలపై మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపిందని మంత్రి పార్ధసారథి తెలిపారు. అమృత్ 2 లో భాగంగా 2026 మార్చి 31 కల్లా పెండిరగ్ పనులు ప్రారంభించాలని కేంద్రం స్పష్టం చేసిందని.. అమృత్ 2లో భాగంగా 506 పెండిరగ్ ప్రాజెక్టులను రూ.9,613 కోట్ల నిధులతో చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. రూ.163 కోట్లతో అమరావతిలో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచే ప్రతిపాదనలకు ఆమోదం లభించిందన్నారు. ఎల్ 1 బిడ్లను ఆమోదించే బాధ్యతను సీఆర్డీఏ కమిషనర్‌కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అమరావతిలో ఇ 3 రోడ్డు విస్తరణకు ఎల్ 1 బిడ్ ఆమోదానికి అమరావతి డెవలప్మెంట్ కార్పోరేషన్ ఎండీకి బాధ్యతలు అప్పగించామన్నారు. సీడ్ యాక్సిస్ రహదారిని 16వ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు రూ.532కోట్ల మేర టెండర్లు పిలిచేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కుప్పంలో పాలేరు నదిపై చెక్ డ్యాంల నిర్వహణకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ముసాయిదా బిల్లుపై కేబినెట్లో చర్చించారు. ఎస్ఐపీబీలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రపెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో 26సంస్థల ఏర్పాటుకు సంబంధించి ఆమోదం తెలిపిన దాదాపు రూ.20,444 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. వీటి ద్వారా 56వేల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగనుందని మంత్రి పార్థసారథి తెలిపారు.చిత్తూరు జిల్లా కుప్పంలో పలార్ నదిపై చెక్ డ్యాం నిర్మాణానికి రూ.15.96 కోట్ల నిధులను పెంచే ప్రతిపాదనకు ఆమోదం లభించిందన్నారు. గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 417 టీచర్ పోస్టులను అప్‌గ్రేడ్ చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. సాంఘిక సంక్షేమం విభాగంలో సామాజిక సేవలో అనుభవం ఉన్న వ్యక్తులను చైర్మన్లు, మెంబర్లుగా నియమించే ప్రతిపాదనకు కేబినెట్ ఓకే చెప్పిందన్నారు. దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ అమరావతిలో ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపామని చెప్పారు. క్వాంటం కంప్యూటింగ్‌లో రూ.1421 కోట్ల రూపాయల పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 3057 మందికి క్వాంటం అప్లికేషన్స్‌లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం చెప్పిందని అన్నారు. క్వాంటం కంప్యూటింగ్ విభాగంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన 11 సంస్థల ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని మంత్రి పార్ధసారథి తెలిపారు. క్వాంటం కంప్యూటర్లు తయారు చేయడం కోసం ముందుకు వచ్చిన పలు సంస్థల ప్రతిపాదనలకు, అలాగే క్వాంటం కంప్యూటింగ్ లో శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపామన్నారు. ఇటీవల ఎస్ఐపీబీ సమావేశంలో తీసుకున్న పలు పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 సంస్థలకు సంబంధించి 20267 కోట్ల రూపాయల పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంచడాన్ని సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. విద్యుత్ చార్జీలను రూ. 5.12 నుంచి 4 రూపాయలకు తీసుకురావాలన్నది సీఎం లక్ష్యమని చెప్పారు. దీని కోసం రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం పలు సంస్థల ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించిందన్నారు. కృష్ణపట్నం పోర్టులో 4731 ఎకరాలు మల్టీ ప్రాడక్ట్ సెజ్ ఏర్పాటు కోసం 2010లో ల్యాండ్ కొనుక్కున్నారని.. అక్టోబర్ 2019లో గత ప్రభుత్వం ఈ భూ కేటాయింపులను రద్దు చేసిందన్నారు. దీన్ని కోర్టు కొట్టి వేయడం వల్ల ప్రాజెక్టు పదేళ్లు ఆలస్యమైనందున పెనాల్టీని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. 3 ఏళ్లలో తొలిదశ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభిం చాలని సమయం ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మహిళల ప్రపంచ కప్ గెలుపులో విశేష ప్రతిభ చూపిన రాష్ట్ర క్రీడాకారిణి శ్రీ చరణికి ప్రోత్సాహకం ఇవ్వాలని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామన్నారు. శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నగదు, విశాఖపట్నంలో 500 గజాలు ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించినట్లు పార్ధసారథి చెప్పారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చే ప్రతిపాదనకు మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. పీఎం సూర్యఘర్ కింద ఇంటిపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకునే బీసీలకు అదనంగా సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీకి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.20 వేల అదనపు సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగం కలిన బీసీ వినియోగదారులకు రూ.20 వేల సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రూ.5445 కోట్ల అంచనా బడ్జెట్‌తో పీఎం సూర్యఘర్ ప్రాజెక్టును రాష్ట్రంలో అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు. ªూష్ట్రంలో రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ విషయంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు సీఎం తెలిపారన్నారు. ఏడాది కాలంలోనే రెవెన్యూ సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించాలని రెవెన్యూ విభాగాన్ని సీఎం ఆదేశించారని తెలిపారు. 22 ఏ , మ్యుటేషన్, రీ సర్వే సమస్యలన్నింటినీ పూర్తిగా పరిష్కరించాలని.. ఆపై రెవెన్యూ రికార్డులన్నింటినీ బ్లాక్ చైన్ టెక్నాలజీ , క్లౌడ్‌లో సేవ్ చేయాలని సీఎం సూచించినట్లు తెలిపారు. తద్వారా రెవెన్యూ రికార్డులు ట్యాంపరింగ్ కాకుండా శాశ్వత పరిష్కారం కల్పించాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి పార్ధసారథి పేర్కొన్నారు.

