nara lokesh cognizent
కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయం ప్రారంభంలో లోకేశ్
విశాఖపట్టణం,డిసెంబర్12: ఏపీ ప్రభుత్వం ఐటీకి ప్రాధాన్యం ఇస్తోందని ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం రుషికొండ ఐటీ పార్క్‌లోని హిల్2పై మహతి ఫిన్టిక్ భవనంలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని తెలిపారు. ఏపీని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికీ సీఎం రాత్రి పది వరకు శ్రమిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐటీకి ఇస్తున్న ప్రాధాన్యతతో ఇతర రాష్టాల్రు అసూయ చెందుతున్నాయని వ్యాఖ్యలు చేశారు. కంపెనీల యాజమాన్యంతో ఎలాంటి లావాదేవీలు చేయమని.. కేవలం భూమి పూజ అలాగే రిబ్బన్ కటింగ్‌లకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాబోతున్న ఐటీ కంపెనీలకు ఉద్యోగులు నిబద్ధతో పని చేయాలని సూచించారు. విశాఖ ప్రజలు రౌడీలను తరిమేశారని.. ఇప్పుడు విశాఖపట్నం ఒక ఎకనామిక్ రీజన్‌గా మారిందన్నారు. 2047 నాటికి ఏపీ బ్జడెట్ 2.4 ట్రిలియన్లకు చేరుతుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. విశాఖ మధురవాడ ఐటీ హిల్స్‌లో పలు కార్యాలయాలకు మంత్రి భూమి పూజ చేశారు. టెక్ తమ్మిన, నాన్ రెల్ టెక్నాలజీస్, ఏసీఎన్ ఇన్ఫోటెక్ లిమెడెట్కు శంకుస్థాపనలు చేశారు. హిల్4లో సత్వాస్ వాంటేజ్ వైజాగ్ క్యాంపస్, ప్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్‌లకు మంత్రి లోకేష్ భూమి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు.

