kanaka durga temple
విజయవాడ:
భవానీ దీక్షా విరమణల కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో విజయవంతంగా ముందుకెళ్తోంది. భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు, జల్లు స్నానాలు తదితరాలతో పాటు భక్తులకు లడ్డూ ప్రసాదంతో పాటు అన్న ప్రసాదానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. భక్తుల భద్రతకు కూడా అత్యంత ప్రాధాన్యమిస్తూ ఆధునిక సాంకేతికత సహాయంతో పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, సీపీ ఎస్వీ రాజశేఖరబాబు, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, ఆలయ ఈవో వీకే శీనా నాయక్ తదితరుల నిరంతర పర్యవేక్షణతో క్షేత్రస్థాయి సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. శుక్రవారం ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, సీపీ రాజశేఖరబాబుతో కలిసి మోడల్ గెస్ట్ హౌజ్‌లోని ఇంటెగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని (ఐసీసీసీ) సందర్శించారు. రద్దీ నియంత్రణ, వాహనాల రాకపోకలు, క్రౌడ్ మేనేజ్మెంట్, శాంతిభద్రతల పరిరక్షణ, క్యూలైన్లు.. ఇలా ప్రతి విషయంలోనూ సీసీసీ అందిస్తున్న సేవలను పరిశీలించారు

