
telugu tv,beta-babies
బీటా బేబీస్ జనరేషన్ వచ్చేసింది

అమ్మో పిల్లలు కాదు వీళ్ళు పిడుగులు.. ఈ సామెత ఇప్పటికే నిజమనిపిస్తుంది కదా !అయితే ఇప్పుడు పుట్టే పిల్లలు ఏ ఐ టెక్నాలజీని చేత్తో పట్టుకుని భూమి మీదకు వస్తారు. నిజమే .. మనమందరం 2025లోకి అడుగుపెట్టేశాం. అయితే ఈ ఏడాదికి ఒక ప్రత్యేక ఉంది. ఇకనుంచి 2025 జనవరి ఒకటి నుంచి పుట్టేవారిని జనరేషన్ బీటాగా పిలవనున్నారు. 2025 నుంచి 2039 మధ్య జన్మించే తరాన్ని బీటా బేబిస్గా పిలవనున్నారు. అయితే ఈ బీటా జనరేషన్ టెక్నాలజీ యుగంలో పిల్లలు అత్యున్నతంగా ఎదుగుతారని నిపుణలు చెబుతున్నారు. అలాగే ఇంతకుముందున్న తరాలు ఎప్పుడూ చూడని సవాళ్లను ఎదుర్కొంటారని.. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారని భావిస్తున్నారు. అయితే జనరేషన్ బీటా తరం 2035 నాటికి ప్రపంచ జనాభాలో 16 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఈ తరం 22వ శతాబ్దపు ప్రారంభానికి సాక్షంగా నిలుస్తారని చెబుతున్నారు. అంతేకాదు సాంకేతిక పరిణామాలు, కృత్రిమ మేధస్సు (ఏఐ), సామాజిక మార్పుల మధ్య బీటా తరం జీవితం గడుపుతుంది. అయితే ఈ తరం ప్రతి అంశంలో కూడా సాంకేతికతను వినియోగించడమే కాకుండా పర్యావరణ, సామాజిక సవాళ్లను కూడా ఎదుర్కోనుంది. ఇదిలాఉండగా.. 1981-1996 మధ్య పుట్టిన వాళ్లను మిలీనియల్స్ అని పిలుస్తారు. 1996
-2010 మధ్య పుట్టినవారిని జెనరేషన్ జెడ్ అని అంటారు. 2010 నుంచి 2024 మధ్య పుట్టిన తరాన్ని అల్ఫా జనరేషన్గా పరిగణిస్తారు. ఇక 2025 నుంచి 2039 మధ్య పుట్టిన తరాన్ని బీటా బేబీస్గా పిలవనున్నారు. అయితే బీటా బేబీస్ తరంపై టెక్నాలజీ యుగం సామాజిక పరిశోధకుడు మార్క్ మెక్క్రిండిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనరేషన్ బీటా వారి జీవితాలు కృత్రిమ మేధా సాయంతోనే సాగుతాయని చెప్పారు. విద్య, ఆరోగ్యం, వినోదం, ఇతర విషయాల్లో వీళ్లు ఎక్కువగా ఏఐని వినియోగిస్తారని పేర్కొన్నారు