telugu tv
త ప్రభుత్వంలో జారీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలతో రైతులు ఎదుర్కొన్న క్షోభను త్యజించి వాటిని సంక్రాంతి భోగి మంటల్లో వేసి కొత్త ఆశలకు నాంది పలుకుతున్నారని సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని గొల్లపూడి వన్ సెంటర్ వద్ద అత్యంత అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బుధవారం తెల్లవారుజామున నిర్వహించిన భోగి వేడుకల్లో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.. రైతుల జీవితాల్లో అనిశ్చితి, అవమానాలకు కారణమైన పాత పట్టాదారు పాసుపుస్తకాలను త్యజించి, ప్రభుత్వం రాజముద్రతో జారీ చేస్తున్న నూతన పట్టాదారు పాసుపుస్తకాలను స్వీకరించడం రైతులు ఆనందంతో ఉన్నారన్నారు. భోగి మంటలు అంటేనే చెడును విడిచి మంచిని ఆహ్వానించే సంప్రదాయానికి ప్రతీక అని అన్నారు. అదే భావంతో రైతులు తమ బాధాకర అనుభవాలకు ముగింపు పలుకుతూ కొత్త నమ్మకం, భరోసాతో ముందుకు సాగుతున్నారని మంత్రి పేర్కొన్నారు. రైతుల శ్రేయస్సే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యంగా ముందుకు వెళ్లుతుందన్నారు. సంక్రాంతి పండుగకు వేలాది మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకి వచ్చి పండుగ చేసుకుంటారన్నారు.

