ap medical council
ఇకపై గోల్డ్ మెడల్స్ ప్రధానం చేస్తాం.

- • ప్రతి ఐదేళ్లకు ఒకసారి వైద్యులు రెన్యూవల్ చేయించుకోవాలి
- • ఆన్ లైన్ విధానం ద్వారా రెన్యూవల్స్ ను మరింత సులభతరం చేస్తాం.
- • విదేశాల్లో వైద్య విద్య చదివిన వారి రిజిస్ట్రేషన్ లు ఎన్ ఎం సీ బంధనల మేరకు అవకాశం కల్పిస్తాం.
- • రెగ్యూలేటరీ అథారిటీగా మెడికల్ కౌన్సిల్ ఉంటుంది.
- • వైద్యులకు, రోగులకు వారధిలా పనిచేస్తాను.
- డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు, ఆంధ్రప్రదేశ్ వైద్యమండలి ఛైర్మన్.
మూడు దశాబ్ధాలుగా వైద్య వృత్తిలో సేవలు అందిస్తున్నాను. అందుకు ప్రతిగా ప్రభుత్వం నాకు ఏపీఎంసీ ఛైర్మన్ గా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వైద్యఆరోగ్య శాఖామాత్యులు సత్యకుమార్ యాదవ్ లకు ఈ సందర్భంగా ఏపీ మెడికల్ కౌన్సిల్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీఎంసీ ఛైర్మన్ గా డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు బుధవారం డాక్టర్ ఎన్టీయార్ వైద్య విశ్వవిద్యాలయం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు మాట్లాడుతూ వైద్యులకు, రోగులకు మధ్య వారధిలా పనిచేస్తానని, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళతానని తెలిపారు. రెగ్యూలేటరీ అథారిటీగా మెడికల్ కౌన్సిల్ ఉంటుందన్నారు. హ్యూమన్ రైట్స్, మహిళా కమిషన్ దృష్టికి వచ్చిన సమస్యలపై తక్షణమే స్పందిస్తామని హామి ఇచ్చారు. వారు ఫిర్యాదు చేసిన వారిపై ముందుగా హెచ్చరికలు చేస్తామని, అయినా తీరుమార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.
నకిలీ పట్టాలతో వైద్య వృత్తిలో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దగ్గుమాటి శ్రీహరిరావు అన్నారు. విదేశాల్లో వైద్య విద్యనభ్యసించిన వారు మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే జాతీయ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో కొన్ని వెసులుబాట్లు కల్పించారని, మన రాష్ట్రంలో కూడా ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు. అలాగే 70 సంవత్సరాలు దాటిన వైద్యులకు క్రెడిట్ అవర్స్ లో సడలింపులు ఉండేలా నిబంధనలు సడలించనున్నామన్నారు. రిజిస్ట్రేషన్లు ఇకపై ఆన్ లైన్ విధానంలో స్లాట్ బుకింగ్ పద్దతిలో కొనసాగించనున్నామన్నారు. రిజిస్ట్రేషన్ అయిన తరువాత వారి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపుతామని వివరించారు. ఇకపై పాత విధానంలో వలే యూనివర్సిటీ స్థాయి, కాలేజీ స్థాయిలో ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలిచిన వైద్య విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ను ప్రధానం చేయాలని సంకల్పించామన్నారు. సమావేశంలో ఎపీఎంసీ వైస్ ఛైర్మన్ డాక్టర్ గోగినేని సుజాత, మెంబర్లు డాక్టర్ కె. సుబ్బానాయుడు, డాక్టర్ సూర్యదేవర కేశవరావు బాబు, డాక్టర్ స్వర్ణ గీత, రిజిస్టార్ ఐ. రమేష్, తదితరులు పాల్గొన్నారు.

