Telugu tv
పురమిత్ర యాప్ పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించండి
విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ,డిసెంబరు 24:
ఒకే ఒక్క యాప్ తో నగరపాలక సంస్థలో కావాల్సిన సేవలన్నీ అందుబాటులో ఉంటాయని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. “పురమిత్ర” ద్వారా ఇంటి వద్దనే ఉంటూ ప్రజలు తమ సమస్యను అధికారులకు తెలియ చేయవచ్చని ఆయన అన్నారు. బుధవారం ఉదయం శాఖాధిపతులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలి కాన్ఫరెన్స్లో పురమిత్ర యాప్ పై ప్రజలందరికీ తెలియజేయాలని, వారికి విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల సమస్యలను ఇంటి వద్దనే ఉంటూ యాప్ ద్వారా అధికారులకు తెలియజేయవచ్చని, అధికారులు వెంటనే స్పందించి ఆ సమస్యలను త్వరగా పరిష్కరిస్తారని ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పురమిత్ర యాప్ ని అందుబాటులోకి తెచ్చిందని, నగర ప్రజలు ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకొని, పురమిత్ర యాప్ ద్వారా ప్రజలు మున్సిపల్ సేవలు, ఫిర్యాదులు, పన్ను చెల్లింపులు, జనన, మరణ, వివాహ ధృవీకరణ పత్రాలు వంటి దాదాపు 122 పురపాలక సేవలు పొందవచ్చన్నారు. సమస్యలను ఫిర్యాదుతో పాటు ఫొటోలను కూడా అప్ లోడ్ చేయవచ్చని తెలిపారు. వీది దీపాలు, చెత్త పేరుకుపోవడం, రెవెన్యూ, పట్టణ (ప్రణాళిక, ఇంజినీరింగ్ అంశాలపై ఫిర్యాదులు, సేవల కోసం దరఖాస్తు, వాటి పరిష్కార స్తితిని తెలుసుకోవానికి ట్రాకింగ్ కూడా ఉంటుందన్నారు. ఫిర్యాదులు, సేవల పరిష్కారానికి నిర్దేశిత గడువు ఉంటుందన్నారు. ఆస్తి పన్ను నీటి చార్జీలు, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, (డ్రైనేజి చార్జీలు, ఆస్తి పన్ను మ్యూటేషన్ ఫీజు, షాప్ లీజులు, అగ్రిమెంట్ ఫీజులు, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ లను యాప్ ద్వారా ఇంటి వద్ద నుండే చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే వారం నుండి వార్డ్ సచివాలయాల వారిగా ప్రజలకు యాప్ డౌన్లోడ్, వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు

