telugu tv
జిల్లా ప్రజలకు కలెక్టర్ లక్ష్మీశ క్రిస్మస్ శుభాకాంక్షలు
విజయవాడ,డిసెంబర్ 24:
ఏసుక్రీస్తు త్యాగం అందరికీ ఆదర్శనీయమని.. క్రీస్తు జన్మదినం క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సవాలతో ఆనందంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ డా. లక్ష్మీశ జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
ఏసు ప్రభువు ప్రేమ, కరుణ అనుసరణీయమని.. దైవదూతగా వచ్చిన ఏసు.. త్యాగం, ప్రేమ, కరుణలతో ప్రజలందరికీ ఒక మార్గం చూపారని తెలిపారు. పాపులను కూడా క్షమించడం, ఆయన క్షమాగుణానికి నిదర్శనమని అన్నారు. ఆయన చూపిన మార్గం స్ఫూర్తిదాయకమన్నారు.ఇతరులకోసం కూడా ప్రార్ధనలు చేసే గొప్ప మనసు క్రైస్తవుల సొంతమని పేర్కొన్నారు. ఈ పర్వదినం జిల్లా ప్రజలందరికీ ఆనందం, ఆరోగ్యం, సమృద్ధి తీసుకురావాలని ఆకాక్షించారు. క్రీస్తు కరుణతో జిల్లా అగ్రగామిగా నిలవాలని కోరుకుంటూ లక్ష్మీశ శుభాకాంక్షలు తెలిపారు

