Telugu Tv,modi ap,pm in ap,modi,

- ఆత్మనిర్భర్ భారత్ కు సరికొత్త శక్తిగా ఏపీ
- గూగుల్ రాకతో ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోంది.
- ఏపీలో రూ.13,429 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టిన ప్రధాని
- చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి
- నారా లోకేష్ సారధ్యంలో పండుగలా జీఎస్టీ సంస్కరణల ప్రచారం
- కర్నూలులో సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ
వికసిత్ ఏపీతోనే వికసిత్ భారత్ లక్ష్యం సాకారం అవుతుందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. స్థానిక ఉత్పత్తులను ప్రొత్సహించినప్పుడే జీఎస్టీ సంస్కరణలకు సార్థకత చేకూరుతుందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ వంటివి సాకారం కావడంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని స్పష్టం చేశారు. ఏపీ యువత ఎంతో చైతన్య కలిగిన వారని… సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి వారి నేతృత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో వెళ్తోందని… కేంద్రం కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సహకరిస్తుందని ప్రధాని చెప్పారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ గురువారం నన్నూరు చెక్ పోస్ట్ సమీపంలో జరిగింది. శ్రీశైలంలో మల్లిఖార్జున స్వామి వారిని, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అనంతరం ప్రధాని కర్నూలు చేరుకున్నారు. కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ జీఎస్టీ బచత్ ఉత్సవ్ పై ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదికకు చేరుకున్న ప్రధానికి మంత్రులు, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. హెలీప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభివాదం చేస్తూ వేదికపైకి చేరుకున్నారు. ఓపెన్ టాప్ జీపులో ర్యాలీగా వచ్చిన ముగ్గురు నేతలకు భారత్ మాతాకీ జై అంటూ మువ్వెన్నల జెండాలతో ప్రజలు స్వాగతం పలికారు. బహిరంగ సభలో జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ…”ఆంధ్రప్రదేశ్ శాస్త్రసాంకేతికంగా అభివృద్ధి చెందిన ప్రాంతం, యువత ఎంతో చైతన్యవంతులు. ఏపీలో విజన్ ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ లాంటి నేతలు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. గత 16 నెలల్లో డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఏపీలో ప్రగతి వేగంగా జరుగుతోంది. ఢిల్లీ, అమరావతిలు రెండూ అభివృద్ది దిశగా వేగంగా ముందుకు వెళ్తున్నాయి. దేశ ఆర్ధిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ఓ కీలక ప్రాంతంగా ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం వేగంగా అభివృద్ది దిశగా నడుస్తోంది. భారత్ దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రగతి వేగాన్ని ప్రపంచం గమనిస్తోంది. గూగుల్ లాంటి ఐటీ దిగ్గజం ఏపీలో అతిపెద్ద పెట్టుబడిని ప్రకటించింది. దేశపు తొలి అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రం విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమెరికా వెలుపల భారీ పెట్టుబడితో ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ పెడుతున్నట్టు గూగుల్ సీఈఓ నాతో చెప్పారు. డేటా సెంటర్, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ లాంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఈ కేంద్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. ప్రపంచ దేశాలను కలుపుతూ వేయనున్న సబ్ సీ కేబుల్ ద్వారా తూర్పు తీరం బలోపేతం అవుతుంది. విశాఖలో ఏర్పాటు కానున్న కనెక్టివిటీ హబ్ భారత్ కే కాదు ప్రపంచానికి సేవలందిస్తుంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు విజన్ ను అభినందిస్తున్నాను. 21వ శతాబ్దపు మాన్యుఫాక్చరింగ్ కేంద్రంగా ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారత్ ఉత్పత్తి కేంద్రంగా రూపు దిద్దుకుంటోంది. ఆత్మనిర్భర్ భారత్ లో ఏపీ కీలకంగా మారింది.” అని ప్రధాని అన్నారు.

