
telugu tv
బీహార్ కు ప్రత్యేక హోదా కోసం జేడీయూ డిమాండ్
చంద్రబాబుకు పరీక్ష పేరున్న నితీష్
బొటాబొటీ మెజార్టీ తో ఏర్పడిన కేంద్ర ప్రభుత్వానికి ఎన్డీఎ కూటమిలోని కీలక పక్షం జేడీయూ ముసలం పెట్టేలా కనిపిస్తుంది.శనివారం ఆ పార్టీ బీహార్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలనీ నిర్ణయం తీసుకుంది.
ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదంటూ 14 వ ఆర్థిక ప్రణాళిక సంఘం గతంలోనే రిపోర్ట్ ఇచ్చింది. దీనిని చూపిస్తూ ఇప్పటి దాకా కేంద్ర ప్రభుత్వం బీహార్,ఏపీ లాంటి రాష్ట్రాలకు హోదా ఇవ్వకుండా ఇన్నాళ్లు గడిపింది. అయితే 2024 ఎన్నికల్లో బీజేపీ కి స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో మిత్ర పక్షాల సంఖ్యా బలం అవసరం ఎక్కువగా వుంది. .ఈ మిత్ర పక్షాల్లో కూడా రెండూ టీడీపీ,జేడీయూ లు కీలకంగా ఉన్నాయి.ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్న రెండు ప్రత్యేక హోదా కావాలనే ఎప్పటి నుండో అడుగుతున్నాయి అయితే గతంలో టీడీపీ అధికారంలో ఉండగా ప్రత్యేక హోదా కు బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది. అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు కూడా ప్రత్యేక ప్యాకేజీ కి ఒప్పుకున్నారు.ఆతర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ అటు హోదా కానీ, ప్రత్యేక ప్యాకేజీ కానీ ఏదీ అడగ లేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇపుడు మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది కానీ కేంద్రంలో కూడా టీడీపీ మద్దతు,అనివార్యం గా మారింది . ఈ పరిస్థితుల్లో ప్రత్యేక హోదా అడిగే అవకాశం ఉన్నా టీడీపీ ఆ దిశ గా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనపడటం లేదు. కానీ ఈ లోగా త్వరలో బీహార్ లో శాసన సభ ఎన్నికలు జరగనున్నందున ఆ రాష్ట్రంలో అధికారాన్ని కాపాడుకునేందుకు నితీష్ ఇప్పటి నుండే పావులు కదుపుతున్నారు. శనివారం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో బీహార్ కు ప్రత్యేక హోదా ఖచ్చితంగా కావాల్సిందే నంటూ తీర్మానం చేసింది.కేంద్రంలో తమ అవసరం ఉన్నందున బీహార్ కు ప్రత్యేక హోదా తీసుకుని రాష్ట్రంలో పట్టు నిలుపుకోవాలని జేడీయూ ప్లాన్ గా కనిపిస్తుంది. ఈ క్రమంలో ప్రత్యేక హోదా అంశం మళ్ళీ తెరపైకి వచ్చినట్లయింది. ఒకవేళ ఇదే అంశం తీవ్రంగా చర్చ జరిగితే టీడీపీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది.ఈ విషయంలో చంద్రబాబుకు అసలైన పరీక్ష మొదలవుతుంది. కేంద్రంలో మెజార్టీ తక్కువగా ఉన్న బీజేపీ ఈ అంశాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి